Posts
Showing posts from August, 2024
కాశికా విశ్వేశ్వర లింగము
- Get link
- X
- Other Apps
ద్వాదశ జ్యోతిర్లింగములలోని 9వ జ్యోతిర్లింగము కాశికా విశ్వేశ్వర లింగము https://ajaraamarasukthi.blogspot.com/2024/08/9-1.html కాశీనాథ అనాథ నేను పథమా కన్పించరాదాయె నే నాశావేశము మేళవింప శుభదాంశాయుక్త ప్రజ్ఞప్తులన్ కాశీ పట్న విభూతికిన్ కలుపుచున్ కౌతూహలాపేక్షతో ఈశా తెల్పగ నెంచినాను దయతో ఈడేర్చుమా కోరికన్ కాశీ మహానగరము సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం | వారాణసీనాథ మనాథ నాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే || ప్రసిద్ధ పుణ్య క్షేత్రములు మూడు విధములు , 1. స్థల, 2. జల, 3. శిల క్షేత్రములు. 1. నైమిశారణ్య స్థల మహత్మ్యమునకు ప్రతీక. (స్థల) 2. గండకి సాలగ్రామములకు ప్రసిద్ధి, అట్లే నర్మద తులా పరీక్షకు నెగ్గిన బాణ లింగములకు ప్రసిద్ధి.(జల) 3.తిరుమల శ్రీనివాసుని క్షేత్రము (శిల) ఈ మూడింటినీ కలిగినది కాశీ పట్టణము. ఈ ఒక్క మాట చాలు ఆపుణ్యక్షేత్ర ప్రకర్ష లేక మహత్తును తెలుపుటకు. అట్టి కాశీని, కాశీనాథుని గూర్చి తెలుపుటకు శివుని మదిలో తలచుకొనుచూ, అల్పజ్ఞుడ నైన నేను వ్రాయ సమకట్టినాను. నాకోసము మీరు చదువనక్కరలేదు విశ్వనాథుని కొరకైనా చదువండి. భక్తితో చేసే పనులక...