Posts

మధుకైటభులు

మధుకైటభులు https://ajaraamarasukthi.blogspot.com/2023/12/blog-post.html శ్రీహరి యోగనిద్రా ముద్రితుడై ఉండగా , ఒకనాడు అతని రెండు చెవుల నుండి ఇద్దరు రాక్షసులు జన్మించినారు. వారే మధుకైటభులు. వారిద్దరూ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి జగన్మాతయగు పరమేశ్వరిని ప్రసన్నం చేసుకున్నారు. తమకు మరణం లేని జీవితాన్ని వరంగా ఇమ్మని దేవిని ప్రార్థించినారు. ' పుట్టినవానికి మరణం తప్పద ' ని , ' కనుక ఆ వరం ఇవ్వడం అసాధ్యమ ' ని జగన్మాత చెప్పింది. "అలా అయితే , మేము ఎపుడు మరణించాలని కోరుకుంటామో , అపుడే మాకు మరణం వచ్చేట్లుగా వరమిమ్మ ' ని వారు ' అమ్మ ' ను ప్రార్థించినారు. అమ్మ ' తథాస్తు ' అని దీవించి అంతర్థానం అయింది. ' స్వచ్ఛంద మరణం ' అనే వరం పొంది యుక్తితో విజయం సాధించామని , తమకు మరణం కావాలని తామే కోరుకోవడం అసంభవం కనుక , తాము మృత్యువును జయించినట్లే అని విఱ్ఱవీగి , మధుకైటభులు విజృంభించ సాగినారు. అన్ని లోకాలపై దండయాత్రలు చేస్తూ , వీరవిహారం ప్రారంభించినారు. సజ్జనులను బాధిస్తూ , లోకకంటకులై ప్రవర్తించసాగినారు. ఒకనాడు మదుకైటభులు బ్రహ్మపై దండెత్తినారు. వారి విజృంభణ...

మహర్షి భృంగి

  మహర్షి భృంగి https://ajaraamarasukthi.blogspot.com/2023/11/blog-post.html శివ పురాణము శివుని ప్రాధాన్యత శివభక్తి పారమ్యత తెలిపే మహా పురాణము. అందులో సంపూర్ణ శివభక్తి తత్పరత కలిగిన ఎందఱో మహా భక్తుల ప్రస్తాపన ఉంది. వారిలో ఋషి   భృంగి యొక్క కథ భక్తి , మొండితనం మరియు చివరికి దైవిక తత్వాన్ని అంగీకరించడం వంటి ఆకర్షణీయమైన కథనంమును మనముందు ఉంచుతుంది. శివ పురాణం ప్రకారము , ఆ మహనీయుడు పరమ శివుని యొక్క గొప్ప భక్తుడు.శివునిపై ఆయన అచంచలమైన విధేయత ఆయనకు శివభక్త తతిలో అత్యున్నత స్థానమును అలంకరింపజేసింది.   అ ఋషిపుంగవుడు తన దైనందిన ఆరాధన అవసాన సమయములో , శివుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు. ఆయన సాక్షాత్తు శివుని మాత్రమే ఆరాధించుతాడు. భృంగి తన ఆరాధనలో స్థిరంగా అన్యుల తలవడు. ఈ విషయమును గమనించి కూడా గౌరీదేవి తానూ ఆ ప్రదక్షిణకు శివునితో బాటుగా భాగస్వామిని కావలెనన్న ప్రగాఢమైన కాంక్షను కలిగి ఆయన వామభాగమున ఆసనము అధిష్ఠించినది. శివుని పట్ల తనకున్న అచంచలమైన భక్తిని వ్యక్తపరచడానికి , శివాంకితమైన హృదయము కలిగినిన మహర్షి భృంగి శివుని వినా తక్కొరులను   పూజింపనోర్వని అటల మనస్కుడై తనను తాను తేనె...

చిదంబర రహస్యం

  చిదంబర రహస్యం https://ajaraamarasukthi.blogspot.com/2023/10/blog-post.html చిదంబర రహస్యమును గురించి చెప్పడం ప్రారంభించే ముందు ‘సత్’ మరియు ‘చిత్’ ను గూర్చి చాలా క్లుప్తంగా తెలియజేస్తాను. ‘సత్’ అంటే ఉన్నది. ‘చిత్’ అనేది స్వయం ప్రకాశించేది. ఒక ఖగోళ వాస్తవికత ఏమిటంటే సూర్యుడు కూడా వేరొక సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడు. ఈ విషయము ప్రస్ఫుటముగా మనము ‘ఆదిత్యో జ్యోతిరాదిత్యః ’ అన్న శ్లోకములో చూడవచ్చు.   కాబట్టి స్వయం ప్రకాశవంతంగా వ్యక్తమయ్యేది ‘చిత్’. అంటే ఆ జ్యోతిరాదిత్యుడే! ఆయనది నిశ్చల తత్వము. మొదట ‘శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే ’ అన్న అద్వైత తత్వము మనము గుర్తుంచుకోవలసినది. సంస్కృతంలో ‘అంబరము’ అన్న మాటకు   1. ఆకాశం 2. వస్త్రం అని రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ ఒక వ్యక్తి తనను తాను చుట్టుకోవడానికి ఆకాశాన్ని తన వస్త్రంగా కలిగి ఉన్నాడు. ‘ఆకాశం’ అంటే ‘శూన్యం’ అంటే శూన్యం అని శాస్త్రం చెబుతోంది. అప్పుడు ఆయన మొత్తము అనంతమైన ఆకాశమును వస్త్రమును కలిగియున్నాడు. అనగా ఆయన దిగంబరుడు , అంటే ఆయన దిక్కులనే విస్తరించిన   అంబరమును వస్త్రముగా ధరించినాడు అని గానీ , లేక ఆయనకు వస్త్ర...

గోమాత సకల శుభదాత

  గోమాత సకల శుభదాత https://ajaraamarasukthi.blogspot.com/2023/10/l-ll.html గావౌ విశ్వస్య మాతరః -- వేదవాక్కు  అదౌ మాతా గురుర్పత్ని బ్రహ్మాణి రాజపత్నిక l దేనుర్ధాత్రి తథా పృథ్వి సప్తైతాః మాతృ దేవతాఃll ధాత్రి = పెంపుడు తల్లి అసలు ఈ ఏడు మందిలో కన్నతల్లి, మిగత నలుగురు కన్నతల్లి లాంటివారు కాబట్టి ఈ ఐదుమంది మాత అన్న గొడుగు క్రిందికే వస్తారు. గోవు మాత. భూమి మాత. వీరిది మానవజన్మ కాకున్నా తల్లికన్న మిన్నయైన సేవ మానవాభ్యుదయమునకు చేస్తారు కాబట్టి వారిరువురు మానవులకు తల్లితో కూడి త్రి మాత్రుకలైనారు. వీరుకాక వీరిని కంటికి రెప్పలాగా చూసుకొనే పరాశక్తి అంటే లోకమాత కూడా చతుర్థ మాతృకగా పరిఢవిల్లినది.  ధేనునాం కామ దేనుకాః (భగవద్గేత 10-28) ఇది కృష్ణ పరమాత్మ చెప్పిన మాట.  గవో మేచాగ్రతో నిత్యం! గావః పృష్టత ఏవచ! గావో మే హృదయేచైవ! గవాం మధ్యే వసామ్యహం! భావముః గోవులు నా ఎదుట, నా వెనుక, నా హృదయమునందు నిత్యము ఉండుగాక, నేను ఎప్పుడూ గోవుల మధ్య ఉందును గాక (స్కాంద పురాణాంతర్గతము). 'ఆ గావో అద్మన్నుత భద్రమగ్రన్ ' అని శ్రుతి గోవులను ఆహ్వానించుతూ మీరు మీ దూడలతో మా ఇళ్ళముందు తిరుగాడుచుండండి అని తెలుపుచున...