Posts

అజరామర సూక్తి - 11

  అజరామర సూక్తి- 301 अजरामर सूक्ति – 301 Eternal Quote - 301 सत्सङ्गश्च विवेकश्च निर्मलं नयनद्वयम् । यस्य नास्ति नरःसोऽन्धः कथं न स्यादमार्गगः ॥ - गरुडपुराण సత్సంగశ్చ వివేకశ్చ నిర్మలం నయనద్వయంl యస్య నాస్తి నరః సో ऽ న్ధః కథం నస్యాదమార్గగః ll గరుడ పురాణము   సత్సంగము , వివేకము మానవుని మలినరహిత మగు ఆరోగ్యకరములగు రెండు  నేత్రములు. ఆరెండు గుణములు లేకపోతే ఆరెండు కళ్ళూ గ్రుడ్డివే! గ్రుడ్డికళ్ళతో చూడవలసినది, చూడ గలిగినది ఏమీ ఉండదు. అంధత్వము ఆవరించి  ఉన్నంతవరకు వాల్మీకి మారలేదు. ఎప్పుడయితే ఆయనకు సప్తర్షి సాంగత్యము  లభించినదో అప్పుడే ఆయన నేత్రద్వయములు   తెరుచుకొన గలిగినాయి. ఎప్పుడయితే  నారద సాంగత్యము లభించినదో కడుపులోనున్న ప్రహ్లాదుడు దైత్యుడయ్యును సాదు  వర్తనుడై సంకర్షణ భక్తుడై విష్ణువునే తనకు, కాలాంతరమున ద్వారపాలకునిగా తన  రసాతల లోక పాలకునిగా యుంచుకొన్నాడన్నది పురాణ కథనము. ఈ శ్లోకమును ఒక పరి పరికించండి. సంసార విష వృక్షస్వ ద్వేఫలే అమృతోపమే l కావ్యామృత రసాస్వాదః సజ్జనై స్సంగమస్సహ ll సంసారమనే విషవృక్షానికి అమృతముతో సమానమైన రె...