Posts

Showing posts from February, 2026

శంకరా-లోకశంకరా

    శంకరా-లోకశంకరా! https://ajaraamarasukthi.blogspot.com/2026/02/blog-post.html లోకము లోలకమ్ము వలె లోప పథమ్మున ఊగుచుండగా చీకటులావరించి జన జీవన ధర్మము గాడి తప్పగా సాకతమూర్తివై భువిన సర్వమతమ్ములు సమ్మతించగా ఏకము అద్వితీయమగు ఈశుని జూపితివీవు శంకరా! చతురామ్నాయ విశేష శాసన ములన్ శర్వాజ్ఞతో   సాంతమున్ పతనంబయ్యెడు ఆర్షధర్మ   విధులన్ పాటింపగాజేయుచున్ సతతతారాధ్యము చేయగల్గితివి నీ చాతుర్యతన్   నాల్గెడల్ సతతానందము ధాత్రిపై వెలయగా సర్వజ్ఞ అస్తంటివే అద్వైత తత్వ మహితకు విద్వాంసులు వేదవిధులు వివహితరణ నొసగా విద్వేషివౌచు   విబుధుడపరమేశ్వరుని విధ్వంసముచేయబూన విజ్ఞతయగునే   నేను ఎన్ని జన్మలెత్తినా అద్వైతిగాత్రిమతాచార్యులలో మిగత ఇరువురికన్నా ఎన్నో వందల సంవత్సరాలు మున్డువాడయిన జగద్గురు శంకరాచార్యుని అనుయాయి గానే ఉండవలెనని   కోరుకొనుచున్నాను. త్రికాశ్మీరములో ఇరువురికన్నా ఎన్నోవందల సంవత్సరాల పూర్వీకులు. కాశ్మీరములో నాడు ఉండిన సర్వజ్ఞ పీఠమును , నాటి సకల పండిత ప్రకాండులను ‘వేద వేదాంగ వేదాంత స్పర్దల యందు ఓడించి’ , అధిరోహించి వారు జగద్గురువులై...