కడప దేవుని గడప
కడప దేవుని గడప https://ajaraamarasukthi.blogspot.com/2025/07/kvbn-oats.html దేశమంటే మట్టిరా ఆ మట్టియే మా తల్లీరా ఆ తల్లిపెరే కడపరా రా ఆ కడప శ్రీపతి గడపరా మనసు మల్లెల తోటరా మా మాట తేనెల ఊటరా మమతా పూవుల బాటరా ఇది శౌర్యవంతుల కోటరా ఆదిశంకర స్థాపితంబౌ పీఠ మొకటే ఆంధ్రకంతకు పురాణాల ప్రసిద్ధిగాంచిన పుష్పగిరి ఆ ప్రాంతము మూడు నదులకు సంగమము అది హరియు హరునకు స్థావరంబది కడప సీమది కలిగియున్నది నటులకిది పుట్టిల్లురా కవిశేఖరుల కాణాచిరా అన్నయ్య త్యాగయ్య శ్యామశాస్త్రుల కన్న సీమయె కడపరా వాణి గళమున వాడిపోవని మల్లెమరువపు మాలరా జాతి కుట్మల స్తబకమై శ్రీ వాణి వేణిన నిలచేరా కడప రాయను పేరుతో మా నాపరాయి ప్రసిద్ధిరా నాడు బంగరు వజ్రముల్ గల గనులకిది కేంద్రమ్మురా ఖనిజాల వనరుల తల్లీరా మా సిమెంటుల ఫాక్టర మా బెరైటీస్ ఆస్బెస్టాస్ ఖనిజ కల్పక భూజములురా మా ఉక్కు గుండెను చాటురా చలన చిత్రపు మహారథులగు KV,BN, ...