Posts

Showing posts from February, 2024

వ్యాకరణము – రూపావతారము

  వ్యాకరణము – రూపావతారము https://ajaraamarasukthi.blo gspot.com/2024/02/blog-post.html నా శ్రీమతి మేనత్తగారి ఇంటిపేరు ‘ రూపావతారం వారు ’ ఊరిపేరుకు బదులుగా రూపావతారం అన్న మాట ఎందుకు వచ్చినది అన్న జిజ్ఞాసతో శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర యతీంద్రులచే తెలుపబడి ఆంగ్లములో వ్రాయబడిన VEDAS అన్న పుస్తకములోని విషయమునకు చాలా సంవత్సరముల క్రిందట చేసిన నా తెనుగుసేత. దీనిని తిరుగదోడుటకు ఆలంబనము నా సహోదరతుల్యుడు రామావఝ్ఝల వెంకట కృష్ణయ్య. వ్యాకరణము . వ్యాకరణము వేదపురుషుని ముఖము. అనగావాక్కునాకు మూలము ముఖమే కదా! వ్యాకరణా లెన్నోవున్నా , ప్రధానమైనది పాణినీయం. పాణినీయానికి పతంజలిమహర్షి భాష్యము వరరుచి వార్తికమూ వ్రాసినారు. వ్యాకరణ సూత్రాల కన్నా వార్తికానికీ , వార్తికానికన్న భాష్యానికీ గౌరవము అధికముగా ఉంటుంది. '' సూచనాత్ సూత్రమ్ '' , అనగా సూత్రము విషయమును సూచన ప్రాయముగా తెలుపుతుంది. పాణిని వ్యాకరణము ఈ సూత్రరూపంలోవున్నది. అన్నిశాస్త్రాలకూ భాష్యాలున్నా వ్యాకరణ భాష్యానికే మహాభాష్యమన్న గౌరవము దక్కుతుంది. చోళమండలంలో శివాలయాలు ఎక్కువ. శివాలయాలలో ' వ్యాకరణదాన మంటపాలు ' అన్న మంటపాలుండేవి....