Posts

Showing posts from September, 2023

వింత పద్యాలు

  వింత పద్యాలు 01\10\23 https://ajaraamarasukthi.blogspot.com/2023/09/blog-post_30.html ఈ పద్ఈయములన్నీ నేనువ్రాసినవే! ఈ ప్రయోగములు తప్పక కష్టముతో కూడుకొన్నవి. ప్రాచీన కవుల లేక   చాటుకవుల రచనలు ఈవిధమైనవి దొరుక వచ్చును. నేటి కవులలోకూడా ఎందరిలోనో ఈ సామర్థ్యము ఉండవచ్చును. ప్రయత్నించినారో లేదో నాకు తెలియదు. చాలా మంది పాఠకులు చాటు పద్యములు ఈవిధమైనవి పెట్టి ఆయా చాటుకవులను ఎంతగానో ప్రశంసించుతారు. కానీ నావంటి అనామకులు ఎవరైనా వ్రాస్తే ఒకనమస్కార చిహ్నముముతో సరి. నాలుగు మంచిమాటలు వ్రాయుటకు బహుశ బద్ధకము కామోసు. వీనికి మనము వ్రాయుట ఏమిటిలే అన్న నిర్లక్ష్యము కూడా కావచ్చునేమో! ఇంతకంటే ఇంకా దారుణమైన విషయము ఏమిటంటే అత్యంత సులభమైన ఒక Like కొట్టి ఊరకుండుట. ఆ Like లేకున్నా నేను బాధపదబోఎది లేదు. ఎందులకంటే నేను Likes కొరకు వ్రాయను. ఇటువంటి రచనలు మన భాషా సంపాదకు తార్కాణములు. కనీసము రెండు పంక్తులలోనైనా మీ అభిప్రాయమును తెలుపండి. నేటికి కూడా ఈ విధముగా వ్రాసేవారు మీ మధ్యన ఉన్నందుకు గర్వించండి. మీరూ వ్రాసే ప్రయత్నము చేయండి.   భాషను కాపాడండి. ఉద్ధరించండి. విస్తృతముగా పదుగురికి పంచి ప్రచారము చేయండి...