Posts

Showing posts from May, 2023

అజరామర సూక్తి (బ్ర.శ్రీ. రేమెళ్ళ వారికి పంపినది)

  అజరామర సూక్తి ( బ్ర.శ్రీ. రేమెళ్ళ   వారికి పంపినది) ఈ దేశమునకు మొదటి పేరు అజ నాభము. అజుడు అంటే బ్రహ్మ దేవుడు. నాభి అంటే బొడ్డు. అంటే గరిమనాభి ( Center of Gravity ) అంటే ఈ దేశము ప్రపంచమునకు గరిమనాభి అనియే కదా అర్థము. ఇది సనాతనము. తపస్సంపన్నులైన మహర్షులు , మహానుభావులు పుట్టిన దేశము ఇది. వారు చెప్పిన నీతి వాక్యములను వీలయినంత వరకూ రెండు రోజులకు ఒకటి వంతున తెలుసుకొందాము.మన ఋషులు మనకు చెప్పిన   నీతులు అగణితములు అనగా లెక్కకు మిక్కుటములు. ప్రపంచములోని ఏదేశము కూడా నీతులకు శాస్త్ర స్థాయిని   ఇవ్వలేదు. మన వాతావరణమునకు మన సాంప్రదాయమునకు సంబంధించిన అనేక సూక్తులను సంస్కృతములో మనకు అందించినారు. తమ లోపములను సవరించుకోనదలచిన పాఠకులు తప్పక ప్రతిరోజూ ఈసూక్తులను చదివి తమను తమ కుటుంబమును , ఆవిధముగా దేశమును ఎంతో ఉన్నత స్థితికి తీసుకుపోయినవారవుతారు. ప్రపంచములో తప్పులే చెయ్యని మానవులు   కూడా ఉంటారేమో! వారు ఈ ' అజరామర సూక్తులు ' చదువవలసిన అవసరము ఉండదు. మహనీయుడు భర్తృహరి తన నీతి , శృంగార , వైరాగ్య శతకముల ముందుమాటగా ఏమి చెప్పినారో తెలుడుకొందాము , బోద్ధారో మత్సరః   గ్రస్తాః ప్రభవ...