Posts

Showing posts from November, 2022

చాణక్య నీతి - 7వ శ్లోకము

  చాణక్య నీతి 7వ శ్లోకము  https://ajaraamarasukthi.blogspot.com/2022/11/blog-post.html చాణక్య నీతి 7వ శ్లోకము  https://ajaraamarasukthi.blogspot.com/2022/11/blog-post.html శ్లో || ఆపదర్థే ధనం రక్షే చ్ఛ్రీమతాం కుత ఆపదః |   కదాచి చ్చలతే లక్ష్మీః సంచితోపివినశ్యతి || 7   అర్థము :- ఆపదర్థే = ఆపదలను బోగొట్టుకొనుటకు , ధనం = ధనమును , రక్షేత్‌ = రక్షింపవలెను , శ్రీమతాం = ధనవంతులకు , ఆపదః = ఆపదలు , కుతః = ఎట్లు కలుగును ? కదాచిత్‌ = ఎన్నడైన దైవ యోగముతో , లక్ష్మీః = సంపద , చలతే = పోయినచో , సంచితో-పి = సంపాదింపబడినది కూడ , వినశ్యతి = నశించి పోవును.   తాత్పర్యము :-ఆపత్కాలములో ఆపదలను నివారించుకొనుటకు ధనమును రక్షించుకొనవలెను. శ్రీమంతులకు ఆపద లెట్లు వచ్చును ? ఎప్పుడైనను దైవయోగము వలన సంపద పోవును. అప్పుడు కూడబెట్టిన ధనము కూడ నష్టమగును. ఇక్కడ రెండు ముఖ్యమైన శ్లోకములను మీ ముందు ఉంచుతాను. మొదటి శ్లోకము విశ్వామిత్రుడు శ్రీరామునితో చెప్పినది్ ధనమార్జిత కాకుత్స ధనమూలమిదం జగత్ l అంతరం నాభిజానామి నిర్ధనస్య మృతస్యచ ll శ్రీరామా! ఈలోకము పూర్తిగా ధనమునకు దాసోహము అంటుంది...