శంబూకుడు
శంబూకుడు P ublished on 02/09/2015 13:38 https://ajaraamarasukthi.blogspot.com/2024/10/blog-post_29.html నారాయణ లోని రెండవ అక్షరము ' రా ' పంచాక్షరి యైన నమశ్నిశివాయ లోని రెండవ అక్షరము ' మ '. ఈ రెండుఅక్షరముల సమన్వయమే ' రామ ' శబ్దము. ' రా ' లేకపోతె ' నారాయణ ' ' న+అయన ' అవుతుంది. అంటే పురోహమించనిది. మరి కదలిక లేనిది శవ సమానమే కదా! అదేవిధముగా ' నమశ్శివాయ ' లో ' మా ' లేకుంటే ' న శివాయ ; అవుతుంది , అంటే సకల సౌభాగ్యమునకు ప్రతీకయన శివము ' న ' అంటే ఉండదు అని అర్థము. కావున ' రామ శబ్దమే మంగళమయ పురోగతికి చిహ్నము. ' రామ నామమే అంత గొప్పది. ఇక ఈ విషయమును గమనించండి: రామో విగ్రహవాన్ ధర్మః ' అని శత్రువగు మారీచునిచే పొగడబడినవాడు , అంటే శ్రీరాముడు ఎంతటి ధర్మ మార్గ పథికుడో మనకు తెలియ వస్తుంది. ఇంకొక మాట గమనించండి: ఇంద్రజిత్తును వధించుటకు ఈ దిగువ మంత్రము చదివి లక్ష్మణుడు బాణము వేసి నిహతుని జేసినాడు. ...