మహర్షి భృంగి
మహర్షి భృంగి https://ajaraamarasukthi.blogspot.com/2023/11/blog-post.html శివ పురాణము శివుని ప్రాధాన్యత శివభక్తి పారమ్యత తెలిపే మహా పురాణము. అందులో సంపూర్ణ శివభక్తి తత్పరత కలిగిన ఎందఱో మహా భక్తుల ప్రస్తాపన ఉంది. వారిలో ఋషి భృంగి యొక్క కథ భక్తి , మొండితనం మరియు చివరికి దైవిక తత్వాన్ని అంగీకరించడం వంటి ఆకర్షణీయమైన కథనంమును మనముందు ఉంచుతుంది. శివ పురాణం ప్రకారము , ఆ మహనీయుడు పరమ శివుని యొక్క గొప్ప భక్తుడు.శివునిపై ఆయన అచంచలమైన విధేయత ఆయనకు శివభక్త తతిలో అత్యున్నత స్థానమును అలంకరింపజేసింది. అ ఋషిపుంగవుడు తన దైనందిన ఆరాధన అవసాన సమయములో , శివుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు. ఆయన సాక్షాత్తు శివుని మాత్రమే ఆరాధించుతాడు. భృంగి తన ఆరాధనలో స్థిరంగా అన్యుల తలవడు. ఈ విషయమును గమనించి కూడా గౌరీదేవి తానూ ఆ ప్రదక్షిణకు శివునితో బాటుగా భాగస్వామిని కావలెనన్న ప్రగాఢమైన కాంక్షను కలిగి ఆయన వామభాగమున ఆసనము అధిష్ఠించినది. శివుని పట్ల తనకున్న అచంచలమైన భక్తిని వ్యక్తపరచడానికి , శివాంకితమైన హృదయము కలిగినిన మహర్షి భృంగి శివుని వినా తక్కొరులను పూజింపనోర్వని అటల మనస్కుడై తనను తాను తేనె...